Rohit Sharma: వైరల్ వీడియో.. చిన్న పాపకు బలంగా తగిలిన రోహిత్ శర్మ సిక్సర్ కొట్టిన బంతి, నొప్పితో విలవిలలాడిన చిన్నారి, ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్న పాప
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్ శర్మ సిక్సర్ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్ శర్మ సిక్సర్ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ విల్లే వేసిన ఓ బంతిని టీమిండియా కెప్టెన్ రోహిత్ పుల్ షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలచగా.. రో'హిట్' చేసిన ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారికి బలంగా తాకింది.
దీంతో ఆ పాప నొప్పితో విలవిలలాడింది. ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ తన సహచరులతో చెప్పగా వారు హిట్ మ్యాన్‌కు జరిగింది వివరించారు. విషయం తెలిసిన రోహిత్ చిన్నారి గురించి ఆరా తీసే క్రమంలో బాధను వ్యక్తం చేశాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ ఫిజియోలు చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వివరాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.