Auto Driver Dies by Suicide: వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుడివాడ మండలం మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు(35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు.

అయితే ఆర్థిక పరిస్థితులు సరిగా లేక జనవరి నెలకు సంబంధించిన వాయిదా చెల్లించలేకపోయాడు. 25వ తేదీ వచ్చినా నగదు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు సత్తిబాబు ఇంటికి వెళ్లారు. తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, అందుకే డబ్బులు చెల్లించడం ఆలస్యమైందని చెప్పాడు.సత్తిబాబు తన ఇంటిని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో ఈనెల 28న ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఆటో స్టాండ్ వద్దకు వెళ్లి సదరు సంస్థ సిబ్బంది గొడవకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన మరణానికి విస్తార్ కంపెనీ ప్రతినిధిలే కారణమని, వారు వేధింపులకు పాల్పడడంతోనే తాను బలవన్మరణానికి పాల్పతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ సూసైడ్ నోట్‌ను ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భర్త మృతితో ఇద్దరు పిల్లలతో సహా తాను రోడ్డున పడ్డానని బాధితురాలు పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.
Auto Driver Dies by Suicide: