Drunk woman Attacks Police: వైరల్ వీడియో, విశాఖలో మద్యం మత్తులో యువతి హల్‌చల్, ఏఎస్‌ఐని కాలితో తన్నుతూ బీరు బాటిల్‌తో దాడి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

విశాఖపట్నంలో మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్‌చల్‌ చేసింది. విశాఖ బీచ్‌ రోడ్డులో బీరు తాగుతూ యువతి న్యూసెన్స్‌ చేసింది. దీనిని ప్రశ్నించిన ఏఎస్‌ఐ సత్యనారాయణపై మద్యం బాటిల్‌తో దాడికి యత్నించింది. అది గురితప్పి పక్కనే ఉన్న గోవింద్‌ అనే యువకుడిని తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Drunk woman attacks police (Photo-Video Grab)

విశాఖపట్నంలో మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్‌చల్‌ చేసింది. విశాఖ బీచ్‌ రోడ్డులో బీరు తాగుతూ యువతి న్యూసెన్స్‌ చేసింది. దీనిని ప్రశ్నించిన ఏఎస్‌ఐ సత్యనారాయణపై మద్యం బాటిల్‌తో దాడికి యత్నించింది. అది గురితప్పి పక్కనే ఉన్న గోవింద్‌ అనే యువకుడిని తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఏఎస్సైని కాలితో తన్ని, దాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరిచింది. పోలీసులు అయితే మీరేం చేస్తారంటూ అసభ్యపదజాలంతో యువతి రెచ్చిపోయింది. ఘటన జరిగిన సమయంలో యువతి ఫుల్‌గా మద్యం సేవించినట్లు గుర్తించారు. గాయపడిన గోవింద్‌ అనే యువకుడు యువతిపై త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now