KA Paul Slams Nara Lokesh: జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై దాని అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్ల కోసం జనసేన టీడీపీకి కుక్కలాగా అమ్ముడుపోయిందన్నారు. ‘ఎవడికి కావాలిరా నీ అపాయింట్‌మెంట్’ అంటూ నారా లోకేష్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు

Chandra babu and Pawan and KA Paul (Photo-X)

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై దాని అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్ల కోసం జనసేన టీడీపీకి కుక్కలాగా అమ్ముడుపోయిందన్నారు. ‘ఎవడికి కావాలిరా నీ అపాయింట్‌మెంట్’ అంటూ నారా లోకేష్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. మీ నాన్న చంద్రబాబే నా ముందు 22 సార్లు నిలబడ్డాడన్నారు. మీ నాన్న అపాయింట్‌మెంట్, నీ అపాయింట్‌మెంట్ నాకు కావాలా? అని ప్రశ్నించారు.

బుద్ధి లేని వారే మీ(టీడీపీ) జెండాలు మోస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. కేంద్రంలోని బీజేపీకి జనసేన, టీడీపీ, జగన్ తొత్తులయ్యారన్నారు. ప్రధాని మోడీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. స్మార్ట్ సిటీలు, కేపిటల్ సిటీ కట్టలేదని మండిపడ్డారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement