Gas Cylinders Exploded: 300 సిలిండర్లు ఒక్కసారిగా పేలితే, ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, సిలిండర్లతో వెళుతున్న లారీలో ఒక్కొక్కటిగా పేలిన సిలిండర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు.

కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement