Jagananna Mahila Mart: కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో కోటి టర్నోవర్ సాధించిన జగనన్న మహిళా మార్ట్, వీడియోను షేర్ చేసిన ఏపీ డిజిటల్ కార్పొరేషన్
కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో మొదలైన ఓ మార్ట్ ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవర్ సాధించింది. ఈ ఘనత సాధించింది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఏర్పాటైన జగనన్న మహిళా మార్ట్.
కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో మొదలైన ఓ మార్ట్ ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవర్ సాధించింది. ఈ ఘనత సాధించింది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఏర్పాటైన జగనన్న మహిళా మార్ట్. కడప జిల్లా పరిధిలోని పులివెందులలో 1,270 పొదుపు సంఘాలు ఉండగా... వాటిలోని 10,200 మంది ఒక్కొక్కరు రూ.150 మేర పొదుపు చేసి రూ.10 లక్షలను సమకూర్చారు. ఈ మొత్తంతో పులివెందులలో జగనన్న మహిళా మార్ట్ పేరిట ఓ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవర్‌ను సాధించింది. మొత్తం మహిళలలే నిర్వహిస్తున్న ఈ మార్ట్ కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగానే రాణిస్తుండటం గమనార్హం. ఈ మార్ట్ విజయ గాథను ప్రస్తావిస్తూ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఓ వీడియోను శుక్రవారం విడుదల చేసింది.