ASI Committed Suicide: వీడియో ఇదిగో, రైలు కిందపడి కమలాపురం ఏఎస్సై ఆత్మహత్య, యూనిఫామ్ తీసి పక్కనపెట్టి మరీ సూసైడ్
వైఎస్సార్ జిల్లాలో కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలుపట్టాలపై ఆయన మృతదేహం లభ్యమైంది
వైఎస్సార్ జిల్లాలో కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలుపట్టాలపై ఆయన మృతదేహం లభ్యమైంది. రాత్రి విధులు ముగిశాక ఉదయాన్నే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ కౌశల్ ఆరా తీస్తున్నారు. గుండెపోటుతో రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన పోలీస్ అధికారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)