RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.

RTC Bus Accident in Roddavalasa (Photo-X)

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.

OD 10S 6754 బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణీకులను అ‍ప్రమత్తం చేశారు. దీంతో, ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి.

RTC Bus Accident in Roddavalasa:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement