Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..
పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శాంతి భద్రతలకు విఘాతంగా కలిగించకుండా.. యువత చెడుమార్గంలో పయనించకుండా చూసుకోవాల్సిన పోలీసులే దారి తప్పారు. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడారు.
వీడియో ఇదిగో, స్కూలుకి వెళ్తూ ఇరుకు దారి రాగానే రోమాన్స్, ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయిన జంట
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విధుల కోసం వచ్చి పేకాట ఆడిన సీఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Videos