YS Jagan: వీడియో ఇదిగో, జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి, వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం

తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్‌ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్‌ జగన్‌ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి

Child Gets Emotional after seeing YS Jagan Mohan Reddy in Vijayawada (Photo-Video Grab)

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy).. విజయవాడ సబ్‌ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్‌ అయ్యారు.తన అభిమాన నాయకుడు విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో అభిమాన సంద్రం ఎగిసిపడింది. అయితే ఓ చిన్నారి.. వైఎస్‌ జగన్‌ను కచ్చితంగా కలవాలనే అక్కడకు వచ్చింది.

వీడియో ఇదిగో, అధికారంలోకి వచ్చాక అందరి బట్టలు ఊడదీసి కొడతాం, కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్‌ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్‌ జగన్‌ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి. జగనన‍్నతో ఫోటోలు దిగిన క్రమంలో తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement