YS Sharmila on Jagan: వీడియో ఇదిగో, జగనన్నను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన షర్మిల, సోషల్ మీడియాలో మాపై అసభ్యకర పోస్టులు పెట్టించింది ఆయనేనని మండిపాటు

YS Sharmila sensational comments on YS Jagan(X)

వైఎస్ జగన్‌ (YS Jagan)మోహన్ రెడ్డి కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. సోషల్ మీడియాలో మాపై అసభ్యకర పోస్టులు పెట్టించింది వైఎస్ జగనే. పోలీసులు తీసుకుంటున్న యాక్షన్ అభినందనీయం కానీ విషనాగులతో పాటు అనకొండలను కూడా అరెస్టు చేయాలన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్పష్టత లేదని షర్మిల అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు దాదాపు రూ.1.20లక్షల కోట్లు కావాలనే అంచనా ఉండగా.. కనీసం పావు వంతు కూడా కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ఇది ప్రజా వంచన బడ్జెట్‌గా కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందన్నారు. మైక్‌ ఇవ్వరు.. మాట్లాడనివ్వరు అంటూ జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉంది. జగన్‌ అహంకారం, అజ్ఞానం బయటపడుతోందన్నారు.

YS Sharmila who demanded the arrest of YS Jagan

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement