AP Road Accident Video: సాగర్ కాల్వలో పడిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, వివాహ రిసెప్షన్‌కు వెళ్తూ 7 మంది తిరిగిరాని లోకాలకు

ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున దర్శి సమీపంలో పెళ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

AP Road Accident Video: సాగర్ కాల్వలో పడిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, వివాహ రిసెప్షన్‌కు వెళ్తూ 7 మంది తిరిగిరాని లోకాలకు
Andhra Pradesh Road Accident Video Credits: Twitter

ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున దర్శి సమీపంలో పెళ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. బస్సు పొదిలి నుంచి బయలుదేరి అర్థగంటలోనే ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర బస్సు ప్రమాదంలో మృతులంతా పొదిలి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో అజీజ్ (65), అబ్దుల్ హాని (60), రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్. షబీనా (35), షేక్. హీనా (6)గా గుర్తించారు.

Andhra Pradesh Road Accident Video Credits: Twitter

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement