Andhra Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Couple Committed suicide by taking a selfie video (Photo-Chota news/X)

ప్రేమజంటకు పెళ్లి చేసి ఆశ్రయం కల్పించినందుకు యువతి తరపు కుటుంబ సభ్యులు ఆ కుటుంబంపై దాడిచేశారు. యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటకు చెందిన ప్రేమికులు పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వేరే ప్రాంతంలో ఉంటున్నారు. యువకుడి బంధువైన మైసన్నగూడేనికి చెందిన రాజు వారికి ఆశ్రయం కల్పించాడన్న కోపంతో యువతి తరపు బంధువులు నిన్న ఆయన ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు.  వీళ్లు అసలు స్కూల్ పిల్లలా? లేక రౌడీ ముఠానా? వీడియో చూసి మీరే చెప్పండి..! (వీడియో)

ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేసిన రాజుపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసే ప్రయత్నం చేయగా స్థానికులు కల్పించుకుని అడ్డుకున్నారు. అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్రతోపాటు మరో 50 మందికిపైగా తనపై దాడిచేసినట్టు బాధితుడు రాజు ఆరోపించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తల్లి కనకదుర్గ, మేనత్త శశిరేఖపైనా నిందితులు దాడిచేసినట్టు రాజు పేర్కొన్నాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement