Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో మహిళను జుట్టు పట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన
విశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని తిరిగి తననే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఎలాంటి విచారణ చేయకుండానే ఇరు వర్గాలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని ఆమె వాపోయింది. కేసును రాజీ చేసుకోవాలంటూ లేదంటే హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందుకు తనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళ ఆరోపించింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Woman Dragged by Hair and Assaulted by Shopkeepers