Andhra Pradesh: కాకినాడలో ఘోర విషాదం, బోరు బావి మోటారు ఎత్తుతుండగా పైపులకు కరెంటు వైర్లు తగిలి ముగ్గురు రైతులు మృతి

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Three farmers died in Kakinada due to electric shock

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒకరు బోరుకు సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారు.

పామాయిల్‌ తోటలో వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురయ్యారు. పొలంలోని విద్యుత్ తీగలు పైపులకు తగలడంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Three farmers died in Kakinada due to electric shock

Here's Disturbed Video 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement