Andhra Pradesh Horror: ఏపీలో ఆగని హత్యలు, చీరాలలో నడిరోడ్డుపై యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, వీడియోలు ఇవిగో..
కారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైకును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయలతో పడివున్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందారు.
బాపట్ల జిల్లా చీరాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడుని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి తీవ్రంగా హతమార్చారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన ఆరిఫ్ స్నేహితుడు కలిసి బైక్ పై చీరాల నుంచి ఈపురుపాలెం వెళ్తుండగా ఆదినారాయణపురం సమీపంలో కారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైకును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయలతో పడివున్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందారు.
ఈపురుపాలెం విద్యార్థి సయ్యద్ అమీన్ ఆరిఫ్ ను అతికిరాతకంగా హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలంటూ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో గడియారం స్తంభం సెంటర్ లో ధర్నా నిర్వహించారు. వివాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైటయించారు. వీడియో ఇదిగో, తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, నుజ్జునుజ్జు అయిన ఇద్దరి మృతదేహాలు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)