Andhra Pradesh:కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్ష, 1600 మీటర్ పరుగు పందెంలో కుప్పకూలి పడిపోయిన యువకుడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్(25)తన స్నేహితుడు గోపితో కలిసి మచిలీపట్నం వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెంలో సొమ్మసిల్లి కింద పడిపోయాడు.

young man dies after falling while running in the constable fitness test

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో అపశృతి చోటు చేసుకుంది. పరుగు పందెంలో పడిపోయి యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లగా..పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్(25)తన స్నేహితుడు గోపితో కలిసి మచిలీపట్నం వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెంలో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు తెలియజేశారు.

దారుణం, అమ్మాయికి విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన

1600 మీటర్ పరుగు పందెంలో కుప్పకూలి పడిపోయిన యువకుడు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement