Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కిడ్నాప్, బొలెరో వాహనంలో కత్తులతో వచ్చి మరీ..
పల్నాడుజిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
పల్నాడుజిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురిపై కత్తులతో దాడి చేసి.. ఒకరిని కిడ్నాప్ చేశారు. దుండగులు. కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఏలూరు జిల్లాలో మరో దారుణ హత్య, భార్యను నరికి చంపి ఇంటి ముందే కత్తితో కూర్చున్న భర్త, విడాకుల గొడవలో బలైన ఇల్లాలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)