Somu Veerraju Slams Chandrababu: ప్రత్యేక హోదా వద్దన్నది నీవే, మళ్లీ కావాలనేది నీవే, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు, వీడియో ఇదిగో..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే.

BJP Andhra Pradesh president Somu Veerraju. (File Photo/ANI)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వేజోన్‌ ఎందుకు తేలేకపోయాడు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్‌ సోమువీర్రాజు నిలదీశారు.

సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా?. తిరుపతిలో హోంమంత్రి అమిత్‌ షాపై దాడి చేస్తే.. వాళ్ల మీద చర్యలు తీసుకున్నావా?. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement