AP Budget Session 2023: వీడియో ఇదిగో, పోలవరం అంటే వైయస్ఆర్, వైయస్ఆర్ అంటే పోలవరం, ప్రారంభించింది నాన్నే… పూర్తి చేసేదీ ఆయన కొడుకేనని తేల్చిన సీఎం జగన్
పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్‌ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే(సీఎం జగన్ తనను తాను ఉద్దేశిస్తూ..) అని ఉద్ఘాటించారు సీఎం జగన్. అసలు పోలవరం అంటే వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్ అంటే పోలవరం అని పేర్కొన్నారాయన.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం జగన్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైన రాలేదని, ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత బాబుకు లేదని స్పష్టం చేశారు. పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్‌ఆర్ చెప్పారు. పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్‌ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే(సీఎం జగన్ తనను తాను ఉద్దేశిస్తూ..) అని ఉద్ఘాటించారు సీఎం జగన్. అసలు పోలవరం అంటే వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్ అంటే పోలవరం అని పేర్కొన్నారాయన.
Here's VIdeo
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)