Andhra Pradesh: దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్
శ్రీకాకుళం జిల్లాలోని స మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి.
శ్రీకాకుళం జిల్లాలోని స మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉండగా.. పెదంచలలో తన నానమ్మతో కలిసి ఉంటోంది బాధితురాలు.
దారుణం, నడిరోడ్డు మీద యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన యువకుడు, వీడియో ఇదిగో..
తన మనుమరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కరరావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు.. కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ..‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా నా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరిశి భాస్కరరావు నా మనవరాల్ని గర్భవతిని చేశాడు. మాకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
disabled woman Raped by TDP Leader in Srikakulam