Hidden Cameras in College Girls' Washroom: పవన్ కళ్యాణ్ ఎక్కడయ్యా, బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, మరింత ఉధృతంగా మారిన విద్యార్థుల ఆందోళన
వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేశారు. ఏమీ జరగలేదంటూ ఎస్పీ చేసిన ప్రకటనపై ఉపాద్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.పవన్ కళ్యాణ్ బయటకి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Here's Video