Lady Aghori: వీడియో ఇదిగో, రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తానంటూ మళ్లీ లేడీ అఘోరీ తణుకులో హల్‌చల్, అక్కడి నుంచి అఘోరీని పంపించిన పోలీసులు
ఈ మధ్య కనపడకుండా పోయిన లేడీ అఘోరీ మళ్లీ తణుకులో హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ హల్ చల్ చేసింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రచ్చ రచ్చ చేసింది
ఈ మధ్య కనపడకుండా పోయిన లేడీ అఘోరీ మళ్లీ తణుకులో హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ హల్ చల్ చేసింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రచ్చ రచ్చ చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ అఘోరీ ని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
కాగా, తనను తాను అఘోర బాబాగా చెప్పుకుంటున్న తణుకుకు చెందిన రాజేష్ నాథ్ అనే వ్యక్తి.. ఇద్దరు అమ్మాయిలతో అసభ్యంగా చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయటకు లీక్ అయ్యాయి. ‘రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందాం’అని యువతులతో చేసిన చాట్ బయటకు వచ్చింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినట్లుగా ఓ ఛానల్ లో ప్రసారం అయింది. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే… తాజాగా దీనిపై లేడీ అఘోరీ నిరసనకు దిగింది.
Lady Aghori Creates Ruckus in Tanuku