Andhra Pradesh: శృతి మించుతున్న భూకబ్జాదారుల ఆగడాలు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన దుర్మార్గులు, అధికారుల అండతో అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోతున్న బ్రదర్స్

జవాన్ సోదరుడి భూమిని కొట్టేశారు కబ్జాకోరులు. కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిచ్చారు రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు.

Land Grabbers Seize Soldier Brother Property at Andhra Pradesh(X)

జవాన్ సోదరుడి భూమిని కొట్టేశారు కబ్జాకోరులు. కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిచ్చారు రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు. ఆంధ్రప్రదేశ్‌లోని'Andhra Pradesh) అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో మట్టి పోసి అడ్డంగా బండలేసి నడిరోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జాకోరులు(Soldier Brother Property).

వీరి కబ్జాల వల్ల అన్యాయానికి గురయ్యారు పారా మిలిటరీ జవాన్ మోహన్(Jawan Mohan) సోదరుడితో సహా 45 మంది బాధితులు. కబ్జాలపై ప్రశ్నించిన వారిపై మారణాయుధాలతో దాడి చేసి, మహిళలను అసభ్యంగా బూతులు తిట్టారు కబ్జాకోరులు.

ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ గుడ్ న్యూస్..ఇకపై రోజుకు 100 మంది ఎన్నారై భక్తులకు శ్రీవారి దర్శనం

ఈ కబ్జాకోరులకు మద్దతుగా నిలిచారు రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి. 2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఎమ్మార్వో, పోలీసులు.

 Land Grabbers Seize Soldier Brother Property at Andhra Pradesh

జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now