JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. నటి మాధవీలతపై అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ కేసు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి.

Police case against JC Prabhakar Reddy at Hyderabad(X)

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు మాధవీలత. సైబరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సినీనటి మాధవీలతపై(Actress Madhavi Latha) తీవ్ర విమర్శలు చేశారు జేసీ. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా అనంతరం ఆమెకు క్షమాపణ చెప్పారు. తాను ఆవేశంతో సినిమా నటి మాధవిలతపై ఆ పదం వాడడం తప్పేనన్నారు. అయితే అయినా శాంతించలేదు మాధవీలత. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది.

మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్

ఇక మరో  వార్తను చూస్తే నటుడు  మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు . మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు MBU యూనివర్సిటీ  P.R.O సతీష్, యూనివర్సిటీ బాడీగార్డ్స్ సంబంధం ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తోంది. బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సైతం వెల్లడించారు.

Police case against JC Prabhakar Reddy at Hyderabad

BREAKING

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement