Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.

Retired Constable and Wife Dies by Suicide in Tirumala(X)

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు. మృతులు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్(Retired Constable) శ్రీనివాసులు నాయుడు భార్య అరుణగా పోలీసులు గుర్తించారు. తిరుపతి అబ్బన్న కాలనీలో నివాసముంటున్న వీరు గురువారం శ్రీవారి దర్శనార్థం వచ్చి నందకంలో గదిని పొందారు.

దర్శనం అనంతరం స్వామివారి దర్శనం బాగా జరిగింది అని వారి పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది(Dies by Suicide in Tirumala). సూసైడ్ నోట్ లో మా చావుకి ఎవరూ కారణం కాదు.. మా చావుకు మేమే కారణం అని రాసి ఉంచినట్లు సమాచారం.

వీడియో ఇదిగో, పందెం కోడి మాంసం సరిగ్గా వడ్డించలేదంటూ కట్టెలతో బీరు బాటిళ్లతో కొట్టుకున్న రెండు గ్రూపులు 

అలాగే తమ దహన సంస్కారాలకి బీరువాలో ఉన్న డబ్బును వాడాలని మా తమ్ముడికి సమాచారం ఇవ్వండి అని రాసి ఉంచినట్లు తెలిసింది. తిరుపతిలో ఉంటున్న భార్యాభర్తలు కొండపై ఆత్మహత్య చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. మృత దేహాలను తిరుపతి రూయా మార్చురీకి తరలించగా ఆత్మహత్య కు గల కారణాలపై విచారిస్తున్నారు తిరుమల టూ టౌన్ పోలీసులు.

Retired Constable and Wife Dies by Suicide in Tirumala

 

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now