మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటలతో కొట్టుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాంనగర్ వడ్డీపల్లిలో పందెంకోడి ప్రాణాలపైకి తెచ్చింది. పందెంకోడి మాంసం పై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గానికి మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటిళ్లతో కొట్టుకున్నాయి రెండు వర్గాలు. ఈ ఘర్షణలో ఐదు గురికి గాయాలు అయ్యాయి. వీరిలో బాలింతైన ఒక మహిళకు కూడా స్వల్ప గాయాలు కావడం గమనార్హం. 8 మందిపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్

మరో ఘటనలో ప్రేయసితో సహజీవనం చేస్తుండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన సత్తెనపల్లిలో జరిగింది.

మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటలతో కొట్టుకున్న రెండు గ్రూపులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)