Mohan Babu College: నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత... మనోజ్ వస్తాడన్న సమాచారంతో గేట్లను మూసివేసిన సిబ్బంది...ర్యాలీగా రంగంపేటకు మనోజ్

నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా రంగంపేటకు వెళ్లారు మనోజ్.

Tension at Mohan Babu College(video grab)

నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా రంగంపేటకు వెళ్లారు మనోజ్. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసింది సిబ్బంది.

మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. మీడియా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పింది భద్రతా సిబ్బంది. కాలేజీ వద్దకు పోలీసులు చేరుకోగా కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇక ఇవాళ ఉదయమే రంగంపేటలో జరిగే జల్లికట్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు మంచు మనోజ్. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉండటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.  రంగంపేటకు మంచు మనోజ్..జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్, మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు

Tension at Mohan Babu College

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement