Manchu Manoj Hulchul (Credits: X)

Tirupati, Feb 18: గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ (Manchu Family) వివాదం తారాస్థాయికి చేరింది.  హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.  ఈ క్రమంలో తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద మంచు మనోజ్ అర్ధరాత్రి హల్‌ చల్ చేశారు. ‘నన్ను అరెస్టు చేయడానికి వచ్చారా?’ అంటూ నిరసనకు దిగారు. తిరుపతిలోని స్థానిక రిసార్ట్ లో సోమవారం అర్థరాత్రి మంచు మనోజ్ బస చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్‌ లో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి ‘మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు?’ అని  ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

వీడియో ఇదిగో, తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ టాలీవుడ్ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

అందుకే వచ్చాం..

‘రిసార్ట్ వద్ద  మీతో పాటు బౌన్సర్లు ఉండడంతో అది గమనించే ఇక్కడికి వచ్చామని, హైవేపై ఇలా బాన్సర్లు ఉండటంతో ఎవరా? అని ఆరా తీయడానికే వచ్చా’మని మనోజ్ తో పోలీసులు అన్నారు. తనను వేదించడానికే పోలీసులు వచ్చారని పేర్కొన్న మనోజ్.. అనంతపురం పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లి మెట్ల పై కూర్చొని నిరసన తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)