టాలీవుడ్‌లో బేబీ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత 'ఎస్‌కేఎన్‌' తాజాగా వివాదాస్పద వార్తకు కేంద్రబిందువుగా మారారు. 'రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్' సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్' సినిమా వేడుకలో హీరోయిన్‌ 'క‌య‌దు లోహ‌ర్' గురించి ఎస్‌కేఎన్‌ మాట్లాడారు. సరిగ్గా హీరోయిన్‌ పేరు కూడా ఆయన పలకలేకపోయారు. 'క‌య‌దు లోహ‌ర్' బదులుగా కాయల్‌ అంటూనే.. ఎమండీ మీ పేరు కాయలా..? పళ్లా..? అంటూ ఎటకారంతో ఆయన (Producer SKN on Telugu Heroines) కవరింగ్‌ చేసేశాడు.

తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

'మేము తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ఇష్ణపడుతాం. ఎందుకంటే, తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్‌ చేస్తే ఏమౌతుందో తర్వాత నాకు తెలిసింది. ఇకనుంచి తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్‌ చేయకూడదని నాతో పాటు మా డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ నిర్ణయించుకున్నాం' అని తెలిపాడు. ఆపై అప్పుచేసి అయినా సరే సినిమా టికెట్లు కొనాలని యూత్‌కు సలహా ఇచ్చాడు. కావాలంటే లోన్‌ యాప్‌ నుంచి డబ్బు తీసుకుని అయినా సరే టికెట్లు కొని సినిమా చూడాలని యూత్‌కు ఉచిత సలహా ఇచ్చాడు.ఎస్‌కేఎన్‌ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి గురించే అతను ఈ కామెంట్‌ చేశాడా..? అంటూ చర్చించుకుంటున్నారు.ల‌వ్ టుడే సినిమాతో త‌మిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జోడీగా రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో రెండో హీరోయిన్‌గా అస్సాం నటి 'క‌య‌దు లోహ‌ర్' నటిస్తుంది.

Producer SKN Comments on Telugu Heroines

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)