SKN (Credits: X)

Hyderabad, Feb 17: తెలుగు నటీమణుల (Telugu Heroines) గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (Baby Producer SKN’s Controversial Comments) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడిన ఎస్కేఎన్.. తాము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ వ్యాఖ్యానించారు. ఎస్కేఎన్ చేసిన ఈ కామెంట్స్‌ వైరల్‌ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా గుర్తింపు.. ఊగిపోయిన భవనాలు.. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అలర్ట్ (వీడియో)

మొన్న శునకానందం అంటూ..

మొన్న చిరంజీవి వ్యాఖ్యలపై మాట్లాడుతూ ఎస్కేఎన్ శునకానందం అంటూ చేసిన కామెంట్ సంచలనంగా మారడం తెలిసిందే. ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని అన్నారు. అయితే చిరు చేసిన లింగ సంబంధ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ వ్యాఖ్య‌ల‌పై ఎస్కేఎన్ స్పందించారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది. నిండైన ఫామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం. అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు’ అని ఎస్‌కేఎన్ విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ