PM Modi (Credits: X)

Newdelhi, Feb 17: సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది (Earthquake In Delhi). రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే (Delhi) భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూంకంపం సంభవించినట్టు జాతీయ భూంకంప కేంద్రం తెలిపింది. భూకంపంతో హస్తినవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతుందో అర్థంకాకుండా ఇండ్లనుంచి బయటకు వచ్చి వీధుల్లో గుమిగూడారు. భూంకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్‌ లో ఓ వ్యాపారి తెలిపారు. ఇక, ఘజియాబాద్‌ లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ

అప్రమత్తత అవసరం

ఢిల్లీ భూకంపం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అందరూ ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. మరోవైపు, ఢిల్లీలో ఇప్పుడే భూకంపం సంభవించిందని తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక