Jagan on Subbarayudu Murder Case: ప్రతి ఊరిలో ఇద్దరు వైసీపీ నాయకులను చంపాలని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే చెబుతున్నాడు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడని మండిపడ్డారు.
వైఎస్ జగన్ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు. సుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదు?. ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్
నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు. ఎవరి ప్రోద్భలంతో పోలీసులు నిందితులకు సహకరించారు.హత్య చేసిన వాళ్లు ఎవరు?. చేయించిన వాళ్లు ఎవరు?. ప్రతీచోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది. హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలి. హత్య జరిగిన తర్వాత గ్రామానికి అడిషనల్ ఫోర్స్ ఎందుకు పంపలేదు?. హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు. ఇంత జరుగుతున్నా అదనపు బలగాలు ఎందుకు రాలేదని మండిపడ్డారు.
Here's Video