వైఎస్ జగన్ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు. సుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదు?. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కోరిన వైఎస్ జగన్, వీడియో ఇదిగో
ఎవరి ప్రోద్భలంతో పోలీసులు నిందితులకు సహకరించారు.హత్య చేసిన వాళ్లు ఎవరు?. చేయించిన వాళ్లు ఎవరు?. ప్రతీచోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది. హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలి. హత్య జరిగిన తర్వాత గ్రామానికి అడిషనల్ ఫోర్స్ ఎందుకు పంపలేదు?. హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు. ఇంత జరుగుతున్నా అదనపు బలగాలు ఎందుకు రాలేదని మండిపడ్డారు.
Here's Video
నంద్యాల జిల్లా సీతారామపురంలో ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు
దీనిలో రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత కూడా గ్రామానికి అడిషనల్ ఫోర్స్ ఎందుకు రాలేదు? హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు?
-@ysjagan గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు pic.twitter.com/kS7eN7e9Ap
— YSR Congress Party (@YSRCParty) August 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)