Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల

కరోనా (Corona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, Dec 20: కరోనా (Corona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌ (New Variant) తో భారతదేశంలోని పలు రాష్ట్రాలల్లో కేసు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్‌ పట్ల తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొత్తగా మంగళవారం 402 మందికి వైద్యారోగ్యశాఖ సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో నాలుగు కరోనా పాజిటివ్ (Covid Positive) కేసులు వెలుగు చూశాయి. దీంతో సుమారు ఆరు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement