Manchu Manoj: మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా జేసీని కలిసిన మంచు మనోజ్.. మా అన్న వల్లే మొత్తం వివాదం జరుగుతోందని కామెంట్, వీడియో ఇదిగో
మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనోజ్..జల్‌పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిశారు మంచు మనోజ్.

మాకు ఆస్తి తగాదాలు ఏమీ లేవు.. మా నాన్నను అడ్డుపెట్టుకుని మా అన్న నాటకం ఆడుతున్నాడు అని తెలిపారు. మా విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.. వాళ్ళ కోసమే నేను పోరాడుతున్నా అని తేల్చిచెప్పారు.
తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు. కొన్ని రోజులుగా తిరుపతిలో మోహన్ బాబు ఉంటుండగా జల్‌పల్లిలో నివాసం ఉంటున్నారు మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు
Manchu Manoj Meets Rangareddy district Joint Collector