Hyderabad Zoo Shocker: హైదరాబాద్‌ జూపార్క్‌లో విషాదం, కేర్‌ టేకర్‌ షాబాజ్‌పై ఏనుగు దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాబాజ్‌ మృతి

అక్టోబరు 7 శనివారం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఏనుగు దాడికి గురై జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మరణించిన మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో జంతు సంరక్షకుడిగా పనిచేస్తున్నాడు.

elephant

అక్టోబరు 7 శనివారం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఏనుగు దాడికి గురై జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మరణించిన మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో జంతు సంరక్షకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం షాబాజ్ తన దినచర్యలో భాగంగా ఏనుగు దగ్గరికి వెళ్లగా ఏనుగు అతని వైపు దూసుకొచ్చింది.  తన దంతాలతో కుమ్మడంతో  కీపర్‌కు తీవ్ర గాయాలయ్యాయి, తరువాత అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. ఏనుగుల దాడిపై నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు విచారణకు ఆదేశించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

elephant

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement