AI Controlled Robot Attempts to Attack People at an Event in China.. Here are the details(X)

Delhi, Feb 27:  చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. రోబో దాడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది(AI Robot Attack). సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

చైనాలో జరిగిన ఈ ఘటన 2010లో విడుదలైన రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘రోబో’ సినిమాను గుర్తు చేస్తోంది(Robo Attack). రోబో నియంత్రణ కోల్పోయి జనాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికాగా భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి నియంత్రణ కోల్పోయిన హ్యూమనాయిడ్ రోబోను అదుపులోకి తీసుకున్నారు.

ఘోర విమాన ప్రమాదంలో 46కు పెరిగిన మృతుల సంఖ్య, గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన సూడాన్ ఆర్మీ ఫ్లైట్ 

అయితే దగ్గరలో ఉన్న మరొక రోబో మాత్రం ప్రశాంతంగా ఉండడం గమనార్హం. రోబో అసాధారణ ప్రవర్తనకు సాఫ్ట్‌వేర్ లోపమే కారణమని చెబుతున్నారు. అయితే ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా AI నియంత్రణలో ఉన్న ఒక డ్రోన్ తన ఆపరేటర్‌పై దాడి చేసిన ఘటన జరిగింది.

AI Controlled Robot Attempts to Attack People 

AI అనేది ప్రోగ్రామింగ్ భాషలపై ఆధారపడి పనిచేస్తుంది, అందువల్ల కోడింగ్ లోపాలు తీవ్రమైన సమస్యలకు దారి తీసే అవకాశముంది. ఇటీవల దక్షిణ కొరియాలో ఓ రోబో ఎక్కువ పని ఒత్తిడిని తట్టుకోలేక, స్వయంగా తన ప్రాణం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు విడుదల చేసిన తాజా నివేదికలు AI టెక్నాలజీ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.