Blast Caught on Camera: వీడియో ఇదిగో, కూకట్పల్లిలో భారీ పేలుడు, ఒకరికి తీవ్ర గాయాలు, సిలిండర్ లోకి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఘటన
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని ఓ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విరాలిలాఉన్నాయి.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ లోని ఓ గ్యాస్ సర్వీస్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలిడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని ఓ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విరాలిలాఉన్నాయి.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ లోని ఓ గ్యాస్ సర్వీస్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలిడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జయ భవాని గోల్డెన్ ఇన్ఫోసిస్టమ్, ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ లో డొమెస్టిక్ సిలిండర్ నుండి చిన్న సిలిండర్ లోకి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది.
పేలుడు దాటికి షాపు మొత్తం ధ్వంసమైంది. ప్రస్తుతం క్షతగాత్రుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నివాసాల వద్ద ఇటువంటి ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేసే షాపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Explosion at ‘Illegal’ Gas Filling Shop in Kukatpally Leaves Owner Seriously Injured in Hyderabad
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)