Suryapet Road Accident: సూర్యాపేట రోడ్డు ప్రమాదం సీసీ పుటేజీ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి ఆగివున్న లారీ కిందకు దూరిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
మునగాల మండలం ముకుందాపురం వద్ద ఆగివున్న లారీ కిందకు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం వద్ద ఆగివున్న లారీ కిందకు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన కారు నంబర్ TS 04 FA 6894. కారులో ప్రయాణిస్తున్న వారు నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం,ఆగివున్న లారీ కిందికి దూసుకుపోయిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)