Students Missing In Amberpet: హైదరాబాద్ అంబర్‌పేటలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకున్న టీచర్, పోలీసుల గాలింపు
హైదరాబాద్ అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు నలుగురు విద్యార్థులు. నిన్న పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకుంది టీచర్
హైదరాబాద్ అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు నలుగురు విద్యార్థులు. నిన్న పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకుంది టీచర్(Students Missing In Amberpet).
తల్లిదండ్రులకు చెప్తానని అనడంతో సాయంత్రం ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు స్టూడెంట్స్ . సికింద్రాబాద్ లోని(Secundrabad) సీసీటీవీలో(CCTV Video) కనిపించారు నికిత్, హర్ష అజ్మత్ మరియు నితీష్. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇక మరో వార్తను పరిశీలిస్తే హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది . మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.
Four students missing in Amberpet..