Accident Caught on Camera: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు సీసీ పుటేజీ ఇదిగో, బైక్‌పై వెళ్తున్న బౌన్సర్‌ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే బౌన్సర్ మృతి
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన తారక్‌రామ్ (30) మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరో బౌన్సర్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో పెద్దమ్మగుడి కమాన్ సమీపంలో మలుపు వద్ద వేగంగా వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చొన్న రాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసును వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Here's Video