Hyderabad Car Accident: వీడియో ఇదిగో, గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, ముగ్గురుకి గాయాలు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి

Hyderabad Car Accident

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. కేర్‌ ఆస్పత్రి వద్దకు రాగానే ఒక కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. రోడ్డుప్రమాదం సంభవించగానే ఇతర వాహనాదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now