Rats In Hospital Ward (Credits: X)

Hyderabad, Mar 9: ఆస్పత్రులు (Hospital) అంటేనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. అయితే, మధ్య ప్రదేశ్‌ లోని మాండ్లా జిల్లా ఆసుపత్రిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో రోగి బెడ్‌ వద్ద అనేక సంఖ్యలో ఎలుకలు (Rats) విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రోగి తల దగ్గర కుప్పలు కుప్పలుగా ఎలుకలు కనిపించాయి.  దీనికి సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. దీంతో రాష్ట్రంలోని ఆస్పత్రుల పరిస్థితులపై ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నదని ఆరోపిస్తున్నారు.

బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)

Here's Video:

ఇక్కడ కూడా..

తెలంగాణలోని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల ఎలుకల బెడద తీవ్రమవుతోంది. ఏ వార్డులో చూసినా మూషికాలు స్వైరవిహారం చేస్తుండటంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022 మార్చిలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరుకగా... తీవ్ర రక్తస్రావం జరిగి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!