Rats Gnawed Currency: పెళ్లికోసం దాచిన సొమ్మును ముక్కలు ముక్కలుగా కొరికిపారేసిన ఎలుకలు, రూ. 2లక్షల ఎలుకల పాల్వడంతో కుటుంబమంతా కన్నీరు మున్నీరు
కూతురి పెళ్లి కోసం రూ.2 లక్షలు సొమ్ము ట్రంకు పెట్టెలో (Box) దాచి పెట్టాడు ఆమె తండ్రి. కూతురి పెళ్లి చేయకుండానే కన్నుమూశాడు. అతను చనిపోయాక పెట్టె తెరిచి చూసిన అతని తల్లిదండ్రులు షాకయ్యారు. ఎలుకలు కరెన్సీ నోట్లను మొత్తం కొరికి పారేశాయి(Rats Gnawed Currency). కష్టపడి కొడుకు దాచిన సొమ్ము ఎలుకల పాలవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
Chittoor, NOV 18: కూతురి పెళ్లి కోసం రూ.2 లక్షలు సొమ్ము ట్రంకు పెట్టెలో (Box) దాచి పెట్టాడు ఆమె తండ్రి. కూతురి పెళ్లి చేయకుండానే కన్నుమూశాడు. అతను చనిపోయాక పెట్టె తెరిచి చూసిన అతని తల్లిదండ్రులు షాకయ్యారు. ఎలుకలు కరెన్సీ నోట్లను మొత్తం కొరికి పారేశాయి(Rats Gnawed Currency). కష్టపడి కొడుకు దాచిన సొమ్ము ఎలుకల పాలవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పుత్తూరులో ఎలుకలు కరెన్సీ నోట్లు కొరికేసిన (Rats Gnawed Currency) ఘటన చోటు చేసుకుంది.
Three months ago Gopal Rao, elder son of Adimulam Lakshman Rao & Gumpamma, passed away; Cash, estimated to be about Rs 2 lakh, he saved in tin trunk at home for his daughters' marriage eaten away by termites in #PutturVillage #Parvathipuram #Manyam #AndhraPradesh @ndtv @ndtvindia pic.twitter.com/TAzXUk6acn
— Uma Sudhir (@umasudhir) November 18, 2023
గోపాల్రావు అనే వ్యక్తి కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టాడు. అలా రూ.2 లక్షల సొమ్మును ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. గోపాల్రావు మూడు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇటీవల అతని కుటుంబ సభ్యులు ట్రంకు పెట్టెను తెరిచి చూసారు. ఒక్కసారిగా షాకయ్యారు. గోపాల్రావు దాచిపెట్టిన సొమ్మంతా ఎలుకలు కొరికేసాయి. గోపాల్రావు కష్టార్జితం కాస్త ఎలుకలు కొరికేయడం చూసి అతని తల్లిదండ్రులు లక్ష్మణరావు, గుంపమ్మ, తమ్ముడు చిన్నారావు కన్నీరు మున్నీరయ్యారు. అతని కుటుంబం కోసం కష్టపడిన సొమ్ము ఎందుకు పనికిరాకుండా పోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని వేడుకుంటున్నారు.
(The above story first appeared on LatestLY on Nov 18, 2023 10:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

