Hyderabad Horror: ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, ఇంట్లోకి దూరి కత్తితో యువతి గొంతు కోసిన ప్రేమికుడు, వీడియో ఇదిగో..
హైదరాబాద్‌లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రాగా.. నిందితుడు పరారయ్యాడు.
హైదరాబాద్‌లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది.ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రాగా.. నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఘటనా స్థలానికి దగ్గర్లోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.యువతికి ఇప్పటికే పెళ్లి అయిందని, భర్తతో విడాకులు తీసుకుని తల్లితో కలిసి ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయమే తల్లి షాపుకు వెళ్లగా.. బాధితురాలు ఆఫీసుకు వెళ్లేందుకు తయారవుతోందని అన్నారు. పెళ్ళయిన యువతితో లవ్, పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరూ ఆత్మహత్యాయత్నం, ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం
Here's Video