Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భారీగా పట్టుబడుతున్న నగదు, కవాడీగూడలో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి రసీదులు లేని నగదును జప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి రసీదులు లేని నగదును జప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు వనస్థలిపురంలో ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు.
సైబరాబాద్ పరిధిలోని మాదాపుర్‌లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. రూ.32 లక్షల నగదు పట్టుబడింది. అలాగే, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రూ.10లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. మియాపుర్‌లో చేపట్టిన వాహన తనిఖీల్లో 17కిలోల బంగారం, 17 కిలోల వెండి పట్టుబడిన సంగతి తెలిసిందే.
Here's Video
-
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)