Hyderabad: ఈ మహిళ పాలిట దేవుడైన డ్రైవర్, కదులుతున్న బస్సు ఎక్కుతూ కిందపడిన మహిళ, తర్వాత ఏమైందంటే..

హైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది.

Woman Narrowly Escapes After Fall Down while She was trying to board TSRTC Bus, driver stopped Bus

హైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది. వెంటనే రోడ్డు మీద పడిన మహిళను చూసి డ్రైవర్ బస్సును ఆపాడు. అదృష్టవశాత్తూ ఈ మహిళ తప్పించుకుంది. ఈ ఘటన నిన్న లోత్కుంట బస్టాప్ వద్ద చోటు చేసుకుంది. మహిళలు బస్సు ఎక్కేటప్పుడు బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే డ్రైవర్ చాకచక్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి.  కూకట్‌పల్లిలో కదులుతున్న కారులో మంటలు, భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now