Kamareddy School Bus Fire: వీడియో ఇదిగో, బ్యాటరీ పేలి ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు, భయంతో కేకలు వేసిన విద్యార్థులు
పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. దీంతో.. బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయానికి లోనై కేకలు వేశారు.
ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు రేగిన ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో మంటలు రేగి పొగలు వ్యాపించాయి. దీంతో.. బస్సులో వెళ్తున్న విద్యార్థులు భయానికి లోనై కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు బస్సును ఆపి పిల్లలను కిందికి దింపారు.బస్సు మొత్తం పొగ వ్యాపించి పిల్లలు భయపడడంతో స్థానికులు ఓదార్చారు. ఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. . రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)