Telangana: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు(Telangana). పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. పాల వ్యాపారికి శాలువా కప్పి సన్మానించారు మల్లారెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మల్లారెడ్డి కాలేజీల అధినేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy). ఓ సారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక మల్లారెడ్డి మాట్లాడినా, డ్యాన్స్ చేసినా, విమర్శలు చేసినా సంచలనమే. ఏడు పదుల వయస్సులోనూ యువకుడిగా ఉల్లాసంగా కనిపిస్తారు.
లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో
ఇక మరో ఘటనలో లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.
Malla Reddy rides milk scooter